Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు క్రికెట్‌కు మహ్మద్ షమీ రిటైర్మెంట్

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 8:16 AM జాతీయంక్రీడలు
టెస్టు క్రికెట్‌కు మహ్మద్ షమీ రిటైర్మెంట్ - Ushodayam
భారత బౌలర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన X వేదికగా వెల్లడించారు. టెస్టు జెర్సీ ధరించినప్పటి నుంచి దేశానికి ఏదో చేయాలనే కలతో సాగిన తన ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పిందని తెలిపారు. భారత్ తరఫున 64 టెస్టుల్లో 229 వికెట్లు తీశారు. 2013లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన షమీ, చివరిగా 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు ఆడారు. ఆయన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 9/118.

Comments

G
Loading comments...