Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురికి కాలువలో పడి మహిళ మృతి

Follow Ushodayam Digital on Google
Kiran Nov 05, 2026 10:00 AM జగిత్యాలGeneral
మురికి కాలువలో పడి మహిళ మృతి - Ushodayam Digital
మల్లాపూర్‌ మండల కేంద్రంలో మురికి కాలువలో పడి చిప్ప నడిపి లక్ష్మీ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం బట్టలు కొనుగోలుకు వెళ్లిన ఆమె రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. రాత్రి ఓ ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...