Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో 10 నెలల చిన్నారి మృతి

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:53 PM హైదరాబాద్General
విద్యుత్ షాక్ తో 10 నెలల చిన్నారి మృతి - Udayam
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఇంట్లో ఆడుకుంటూ ఎలక్ట్రానిక్‌ కాంటాను తాకిన 10 నెలల చిన్నారి విభూది ఆద్య విద్యుదాఘాతంతో మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు కాంటాను ఛార్జింగ్‌లో పెట్టగా చిన్నారి దాన్ని తాకింది. గమనించిన తండ్రి పాపను పక్కకు తీసే క్రమంలో ఆయనకూ విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Comments

G
Loading comments...